Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో చెప్తానని ప్రాణాన్నే తీసేశాడు...(Video)

మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు జరుగుతూనే వున్నాయి. తమిళనాడులో ఓ ట్రైనర్.. విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కోయంబత్తూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన మాక్

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (10:40 IST)
మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు జరుగుతూనే వున్నాయి. తమిళనాడులో ఓ ట్రైనర్.. విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కోయంబత్తూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్, ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయట పడాలనే విధానాన్ని ఆ మాస్టర్ పిల్లలకు నేర్పుతున్నాడు. 
 
ఈ మేరకు డ్రిల్ మాస్టర్ కళైమగన్ ఆర్ట్స్ కళాశాలలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కింద విద్యార్థులంతా ఓ నెట్ పట్టుకుని నిల్చుండగా, రెండో అంతస్తు నుంచి లోకేశ్వరి అనే విద్యార్థిని కిందకు దూకేందుకు అంగీకరించింది. ఆపై రెండో అంతస్థు నుంచి ఆమె దూకేందుకు అనుమానిస్తుండగానే.. ట్రైనర్ ఆమెను దూకేయాల్సిందిగా ప్రోత్సహించాడు. 
 
లోకేశ్వరి భయపడుతుంటే కిందకు నెట్టేశాడు. కింద పడుతున్న సమయంలో ఆమె తల మొదటి అంతస్తుకు ఉన్న సన్ షేడ్‌కు బలంగా తాకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments