రాందేవ్ ఓ దొంగ బాబా.. కాషాయం ధరించి వ్యాపారాలు చేసుకోవచ్చా?: డిగ్గీ రాజా

యోగా గురు బాబా రాందేవ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన డిగ్గీ రాజా రాందేవ్‌ ఓ దొంగ బాబా అంటూ

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (10:29 IST)
యోగా గురు బాబా రాందేవ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన డిగ్గీ రాజా రాందేవ్‌ ఓ దొంగ బాబా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ అనుచరులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ దిగ్విజయ్ ఇటీవలే ఓ ట్వీట్ చేశారు. అఖిల భారతీయ ఆకార పరిషత్‌ ఆదివారం 14 మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. 
 
కానీ బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని డిగ్గీ రాజా అన్నారు. నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనని దిగ్విజయ్ అన్నారు. 
 
మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మికవేత్తగా ఉన్నవ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ డిగ్గీ రాజా ప్రశ్నించారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suhasini : వినోద్ కుమార్, సుహాసిని కాంబినేషన్ లో సినిమా

Sampoornesh Babu: నాని చిత్రం ది ప్యారడైజ్ లో సంపూర్ణేశ్ బాబు లుక్

Vijay Antony: బుకీ నుంచి విజయ్ ఆంటోనీ ఆలపించిన బ్రేకప్ యాంథమ్ రిలీజ్

'దురంధర్' చిత్రాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి : రాంగోపాల్ వర్మ

మంచి ఛాన్స్ లభిస్తే రీఎంట్రీ : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్ష... ఖర్చు ఎంతంటే?

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

తర్వాతి కథనం
Show comments