Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021లో మొబైల్ యాప్‌తో జనాభా లెక్కలు

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (15:31 IST)
డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో కేంద్ర ప్ర‌భుత్వం జ‌నాభా లెక్క‌లు చేప‌ట్ట‌నున్న‌ది. 2021లో డిజిట‌ల్ ప్ర‌క్రియ ద్వారా జ‌నాభా గ‌ణ‌న ఉంటుంద‌ని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఒక ప్ర‌త్యేక‌మైన డిజిట‌ల్ యాప్ ద్వారా దేశ జ‌నాభాను లెక్కించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. పేప‌ర్ నుంచి డిజిట‌ల్ జ‌నాభా లెక్కింపు దిశ‌గా ప‌రివ‌ర్త‌న జ‌రుగుతుంద‌న్నారు.

ఆయన సోమవారం ఢిల్లీలో రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(ఆర్‌జీఐ) కొత్త బిల్డింగ్ శంకుస్థాప‌న‌లో కేంద్ర మంత్రి షా పాల్గొన్నారు. దేశంలో జ‌నాభా లెక్క‌లు నిర్వ‌హించేంది ఆర్‌జీఐ మాత్ర‌మే. డిజిట‌ల్ లెక్కింపు ద్వారా.. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, బ్యాంక్ అకౌంట్‌, డ్రైవింగ్ లైసెన్సు లాంటి కార్డుల‌న్నీ ఒకే ఫ్లాట్‌ఫామ్‌పైకి వ‌స్తాయ‌న్నారు. 
 
జనాభా లెక్కింపు ప్ర‌క్రియ డేటాతో జ‌న‌న‌, మ‌ర‌ణధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను జ‌త‌చేయ‌డానికి ఎందుకు ఇబ్బందిప‌డ‌డం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నేష‌న‌ల్ పాపులేష‌న్ రిజ‌స్ట‌ర్ (ఎన్‌పీఆర్‌), జ‌నాభా లెక్క‌ల కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్ర‌తి పౌరుడి బ‌యోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్ వివ‌రాల‌ను ఎన్‌పీఆర్‌తో అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments