Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్ పోస్టుకు ఎసరు... ప్రశాంత భూషణ్, యోగేంద్రలపై వేటు...?

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (15:34 IST)
మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 70కి 67 సీట్లిచ్చి బంపర్ మెజారిటీతో గెలిపించిన ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం మొదలైంది. ఆ పార్టీలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. పాలన సంగతి ఏమోగానీ ఒకరి కింద ఇంకొకరు గుంతలు తీసుకునే పరిస్థితి తలెత్తినట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్‌ను పార్టీ జాతీయ కన్వీనర్ పదవి నుంచి తప్పించాలని కుట్రలు జోరుగా సాగుతున్నట్లు గత వారంలో చోటుచేసుకున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
 
ఆప్ సీనియర్ నాయకులు యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌ భూషణ్ ఈ కుట్రకు కేంద్ర బిందువులని వారిద్దరిపైనా ఈ ఆరోపణలు రావడం విశేషం. దీనిపై ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సోమవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్‌ను పార్టీ జాతీయ కన్వీనర్ పదవి నుంచి తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ పరోక్ష విమర్శలు చేశారు. పార్టీ అంతర్గత విషయాలను బజారున పడవేయడం చూస్తుంటే వారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందన్నారు.
 
పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడిందని ప్రచారం చేస్తున్న వారిపై బుధవారం జరిగే పార్టీ జాతీయ ప్రతినిధుల చర్చించి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు సోమవారం నాటి సమావేశంలో కేజ్రీవాల్ కన్వీనర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఐతే సహచరులు వారించడంతో ఆయన మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం ఆ పార్టీని ఏ తీరానికి చేర్చుతుందో చూడాల్సిందే.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments