Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేను ఈల వేస్తే గోలుకొండ అదిరిపోతది'...

బుల్లితెర నటి నుంచి పూర్తిస్థాయి రాజకీయనాయకురాలిగా మారిన మహిళ స్మృతి ఇరానీ. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆమె ఎక్కడ ఏ పని చేసినా దానికి విస్తృత ప్రచారం లభిస్తుంది.

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (09:37 IST)
బుల్లితెర నటి నుంచి పూర్తిస్థాయి రాజకీయనాయకురాలిగా మారిన మహిళ స్మృతి ఇరానీ. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆమె ఎక్కడ ఏ పని చేసినా దానికి విస్తృత ప్రచారం లభిస్తుంది. తాజాగా ఆమె పార్లమెంట్‌లో ఈల వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇది గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
గత నెలలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో రసవత్తర చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ తన ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకున్నారు. ఆపై తన స్థానంలో కూర్చుని కన్ను కొట్టిన దృశ్యాలను బీజేపీ వైరల్ చేస్తుండగా, దీనికి ప్రతిగా, స్మృతీ ఇరానీ ఈల వేస్తున్న దృశ్యాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.
 
నసీమ్ అహ్మద్ అనే వ్యక్తి ఈ ఫొటోను తొలుత షేర్ చేశాడు. ఇక ఈ ఫొటోను గూగుల్‌లో వెతుకగా, అది గత సంవత్సరం అక్టోబరు నెలలోదని, ఆమె ఈల వేసింది పార్లమెంట్‌లో కాదని తెలుస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వేళ, విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు స్మృతీ ఇరానీ విజిల్ వేశారని తెలుస్తోంది. ఇక బీజేపీ మద్దతుదారులు ఇదే విషయాన్ని తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పంచుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments