జైలు నుంచి బయటికెళ్లి సంచి చేత పట్టుకుని షాపింగ్‌ చేసిన శశికళ..?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత చిన్నమ్మ శశికళకు చిప్పకూడు తప్పలేదు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బెంగళూరు జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ.. జైలులో వుండకుండా హ్యాపీగా సంచి చేత బట్టుక

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (12:30 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత చిన్నమ్మ శశికళకు చిప్పకూడు తప్పలేదు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే బెంగళూరు జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ.. జైలులో వుండకుండా హ్యాపీగా సంచి చేత బట్టుకుని షాపింగ్ వెళ్ళి వస్తుండేది. ఈ విషయాన్ని మాజీ డీఐజీ రూప వీడియో ద్వారా తెలియజేశారు. జైలులో ఉంటున్నప్పటికీ.. జైలు ఉన్నతాధికారుల సాయంతో చిన్నమ్మ రాజభోగాలు అనుభవిస్తుంది. చిన్నమ్మ జైలులో సంతోషంగా వుందని.. మాజీ డీఐజీ రూప వెలుగులోకి తెచ్చారు. 
 
రూప ఆరోపణలను తిప్పికొట్టిన జైళ్ళ శాఖ ఉన్నతాధికారులు ఆమెను ఆమెపై బదిలీవేటు వేశారు. అయినా రూప వెనక్కి తగ్గకపోవడంతో శశికళ అంశానికి సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఇంతలోనే రూప మరో సంచలనం బయటపెట్టింది.
 
శశికళ తన బంధువు ఇళవరసి జైలు నుంచి బయటికెళ్లి.. బెంగళూరులో షాపింగ్ చేశారని.. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను కూడా బయటపెట్టారు. జైలు మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికెళ్లడం.. ఆ తర్వాత అదే గేట్ నుంచి లోపలికి రావడం.. సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే బెంగళూరు ఎంజీ రోడ్డులో బుర్ఖా వేసుకుని శశికళ షాపింగ్ చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధంచి సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఉన్నట్టు సమాచారం.
 
జైలులో వుంటూ ఇలా రాణి భోగాలు అనుభవిస్తున్న చిన్నమ్మను అన్నాడీఎంకే పార్టీ నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అదే కనుక జరిగితే చిన్నమ్మ రాజకీయ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టినట్టేనని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments