Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (19:35 IST)
ఇటీవల గుజరాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఎయిరిండియా విమానాల్లో భద్రతా ప్రమాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దేశ వ్యాప్తంగా విమానయాన భద్రతపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా నిర్వహించిన తనిఖీల్లో పలు ప్రధాన విమానాశ్రయాల్లో విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలు ఉన్నట్టు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. విమానాలు, రన్‌వేలు సహా పలు కీలక విభాగాల్లో ఈ సమస్యలు ఉన్నాయని డీజీసీఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 
 
డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని రెండు ప్రత్యేక బృందాలు ఇటీవల ఢిల్లీ, ముంబై వంటి దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో సమగ్రమైన తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో భాగంగా, ఫ్లైట్ ఆపరేషన్స్, ర్యాంప్ సేఫ్టీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ అండ్ నేవిగేషన్ పరికరాలు, విమానం ఎక్కే ముందు సిబ్బందికి నిర్వహించే వైద్య పరీక్షలు వంటి అనేక కీలక అంశాలను నిశితంగా పరిశీలించినట్టు అధికారులు తెలిపారు. 
 
లోపాలు ఉన్న విమానయాన సంస్థలు లేదా ఇతర విభాగాల పేర్లను డీజీసీఏ ప్రస్తుతానికి బయటపెట్టలేదు. అయితే, గుర్తించిన లోపాలన్నింటినీ సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్ళామని తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు డీజీసీఏ స్పష్టం చేసింది. విమాన ప్రమాణాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments