Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్ గూటికి 6 మంది ఎమ్మెల్యేలు.. పన్నీర్ పక్షాన 12 మంది.. పళని సర్కార్ కూలుతుందా?

తమిళనాట రాజకీయాలు మరోమారు రసవత్తరంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య రాజీకుదిరి గంటలైనా కాకముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు రెండు వర్గాలుగ

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (10:49 IST)
తమిళనాట రాజకీయాలు మరోమారు రసవత్తరంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య రాజీకుదిరి గంటలైనా కాకముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే.. ఇపుడు మూడో వర్గం పుట్టుకొచ్చింది. అదే టీటీవీ దినకరన్ వర్గం. 
 
పార్టీలో వైరి వర్గాలు ఒక్కటి అయ్యేందుకు పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్‌ కుటుంబాన్ని పక్కనపెట్టాలన్నది మాజీ సీఎం పన్నీర్ ప్రధాన డిమాండ్. ఆ మేరకు అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక త్రి జయకుమార్‌ వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడగానే టీటీవీ దినకరన్ వెంట ముగ్గురు చేశారు. బుధవారం ఉదయానికి ఈ సంఖ్య పదికి చేరింది. 
 
దీంతో దినకరన్ శిబిరంలో 6 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పన్నీర్ వర్గంలో 12 మంది ఉన్నారు. మిగిలిన వారు ముఖ్యమంత్రి పళనిస్వామి వెంట ఉన్నట్టు సమాచారం. అయితే, వీరిలో ఎంతమంది దినకరన్ వైపుకు వెళతారో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం పూర్తికాలం మనుగడ కొనసాగిస్తుందో.. లేదో వేచిచూడాల్సిందే. 
 
మరోవైపు పార్టీలో జరిగిన తాజా పరిణామాలపై దినకరన్ స్పందిస్తూ అన్నాడీఎంకేలో తనపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని.. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాజా పరిస్థితులపై చర్చిచేందుకు ఈరోజు మధ్యాహ్నం దినకరన్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments