Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో అల్పపీడనం.. అల్లకల్లోలంగా మారిన సముద్రం

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (18:52 IST)
Tamil Nadu
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం క్రమంగా నైరుతి బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రరూపం దాల్చింది. మరో 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి పుదుచ్చేరి, తమిళనాడు మధ్యలోని కారైకాల్‌, మామల్లాపురం మధ్య తీరాన్ని తాకనుంది. మంగళవారం నాడు ఈ తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. 
 
ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో పుదుచ్చేరిలోని గాంధీ బీచ్ ఏరియాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఇది వాయువ్య దిశగా ప్రయాణించి తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వద్ద కారైకల్‌-మహాబలిపురం మధ్య ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరాన్ని దాటే అవకాశాలున్నట్లు కూడా తెలిపారు.

దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులలో కురిసే అవకాశాలున్నాయని నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల్లోని మిగతా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments