Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఆ స్థితిలో సెక్సుకు అంగీకరించకపోవడం క్రూరత్వం కాదు... హైకోర్టు

న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు మరో తీర్పు ఇచ్చింది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో శృంగారానికి అంగీకరించకపోవడం అనేది క్రూరత్వం కాదని స్పష్టీకరించింది. తన భార్య గర్భం ధరించిన దగ్గర్నుంచి తనతో సెక్సుకు అంగీకరించడంలేదంటూ ఓ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయి

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (13:08 IST)
న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు మరో తీర్పు ఇచ్చింది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో శృంగారానికి అంగీకరించకపోవడం అనేది క్రూరత్వం కాదని స్పష్టీకరించింది. తన భార్య గర్భం ధరించిన దగ్గర్నుంచి తనతో సెక్సుకు అంగీకరించడంలేదంటూ ఓ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడంలేదనీ, పైగా తనతో శృంగారానికి అంగీకరించడంలేదని అతడు కోర్టులో పిటీషన్ వేసాడు. 
 
దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. భార్య ఉదయం త్వరగా నిద్రలేవకపోవడమే కాదు మంచం మీదికే తనకు అవసరమైన పనులు కావాలని కోరడం వంటివన్నీ ఆమె ఆరోగ్య పరిస్థితిని, బద్ధకాన్ని తెలుపుతాయి తప్ప క్రూరత్వం కాదని తేల్చి చెప్పింది. కాగా అతడు తన భార్యతో విడాకులు కావాలని అంతకుముందు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దానిని ఫ్యామిలీ కోర్టు కొట్టివేయగా హైకోర్టును ఆశ్రయించాడు సదరు భర్త. ఇక్కడ కూడా అతడి పిటీషన్‌ను తిరస్కరించింది హైకోర్టు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం