Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢ నిద్రలో ప్రయాణికులు - యువతిపై బస్సు క్లీనర్ అత్యాచారం...

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (17:44 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం జరిగే సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు క్లీనరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సులో 30 యేళ్ళ ఓ యువతి ఎక్కింది. ఆమెతో పాటు.. మరో 45 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అయితే, బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా, ఈ యువతిపై బస్సు క్లీనర్ అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించింది. 
 
స్లీపర్ బస్సులో ప్రయాణికులంతా నిద్రిస్తుండగా.. బస్సు క్లీనర్ ఆమెను బలాత్కరించినట్టు ఆమె పేర్కొంది. ఈ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళుతుండగా, ఈ ఘాతుకం జరిగినట్టు సమాచారం. సమయంలో బస్సులో 45మందిపైగా ప్రయాణికులున్నారని ఆమె చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments