Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెండ్ కుమార్తె కదా అని ఇంట్లోకి రానిస్తే....

Webdunia
సోమవారం, 6 జులై 2020 (11:35 IST)
తన స్నేహితురాలి కుమార్తె కదా అని ఆ యువతిని ఇంట్లోకి రానిచ్చింది. ఇదే అదునుగా భావించిన ఆ యువతి ఏకంగా 57 లక్షల రూపాయలను కాజేసింది. ఆలస్యంగా తెలుసుకున్న ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సెంట్రల్ ఢిల్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ ఢిల్లీకి చెందిన పుష్ప అనే మహిళ... తన ఇంట్లో దొంగతనం జరిగిందని, ఓ ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును ఇంట్లో దాచుకుంటే పోయిందని, తన కుమార్తె స్నేహితురాలైన పూజ అనే యువతిపైనే అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో భాగంగా, పూజ అనే యువతిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం చెప్పుకొచ్చింది. పుష్ప ఇంట్లో పెద్దమొత్తంలో డబ్బుందని తెలుసుకున్న ఆమె, ఓ దఫా రూ.27 లక్షలు కాజేసి తన తమ్ముళ్లు వరుణ్, అమిత్‌లకు ఇచ్చి, వారితో ఫ్లాట్ కొనిపించింది. 
 
మరోసారి ఆమె ఇంటికి వెళ్లి, ఇంకో రూ.30 లక్షలు కాజేసింది. పుష్ప ఫిర్యాదుతో విచారించిన పోలీసులు, పూజ నుంచి రూ.29.43 లక్షలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆమె కొనుగోలు చేయించిన ఫ్లాట్‌ను, దొంగిలించిన డబ్బుతో కొన్న నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె సోదరులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments