Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పార్కులో అత్యాచారం: బస్టాండ్‌‍లో దించుతానని క్యాబ్ డ్రైవర్ కారులో ఎక్కించుకుని..?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు భద్రత రోజు రోజుకీ కరువవుతోంది. రైలు కోసం వేచి వున్న యువతితో మాటలు కలిపాడు. ఆమెను నమ్మించి బస్టాండ్‌లో దింపుతానని కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (14:01 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు భద్రత రోజు రోజుకీ కరువవుతోంది. రైలు కోసం వేచి వున్న యువతితో మాటలు కలిపాడు. ఆమెను నమ్మించి బస్టాండ్‌లో దింపుతానని కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 11వ తేదీన 23 ఏళ్ల యువతి లూధియానా వెళ్లేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. 12వ తేదీ తెల్లవారుజామున రైలు వస్తుందని తెలియడంతో యువతి వెయిటింగ్ రూమ్‌లో వేచి వుంది. 
 
12వతేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆ యువతి వెయిటింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చింది. ఆమెను చూసిన కారు డ్రైవర్ చున్ను కుమార్.. ఆమెతో మాటలు కలిపాడు. లూధియానా రైలు రద్దు అయినట్లు నమ్మించాడు. తన కారులో సమీపంలో ఉన్న బస్టాండు వద్ద దింపుతానని అక్కడి నుంచి లూధియానా వెళ్లొచ్చని సూచించాడు. 
 
కుమార్ మాటల్ని నమ్మిన ఆ యువతి మోసపోయింది. కారులో ఎక్కిన యువతిని రెడ్‌ ఫోర్ట్‌ వద్ద గోల్డెన్‌ జూబ్లి పార్కుకు తీసుకెళ్లిన కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను అదే కారులో ఎక్కించుకుని పాత ఢిల్లీ రైల్వేస్టేషన్‌ వద్ద వదిలి పరారైనాడు. ఈ ఘటనపై బాధితురాలి సోదరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments