Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరిట మోసం.. సహజీవనం.. 21 మందిని అలా చేసేందుకు రెడీ..

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (14:05 IST)
దేశ రాజధాని ఢిల్లీలో నిత్య పెళ్లి కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఐదుగురిని పెళ్లి పేరిట మోసం చేశాడు. అక్కడితో ఆగకుండా మరో 21మందిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానాకు చెందిన అభిషేక్ వశిష్ట్ అలియాస్ అభినవ్ అభిరుంద్రాంశ్ ఇప్పటి వరకు ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. 
 
భర్తతో విడిపోయిన మహిళల వివరాలను సేకరించి.. వారితో స్నేహం చేసి.. ఆపై ప్రేమ పేరుతో వలలో వేసుకునే వాడు. చివరికి పెళ్లి చేసుకుని మోసం చేసేవాడు. తానో మీడియా హౌస్ ఓనర్ అని నమ్మించి.. ఈ పని అంతా కానిచ్చాడు. అయితే అభిషేక్ వశిష్ట్‌పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 
 
అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు హరిద్వార్‌లో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారిలో సహజీవనం చేస్తున్నాడు. అంతేకాకుండా మాట్రిమోనియల్ సైట్లలో నకిలీ పేర్లతో పెళ్లి కోసం సంప్రదింపులు జరుపుతున్నాడని విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుడిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని హరిద్వార్‌లో అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments