Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ బాబా అరెస్ట్.. తల్లీకూతుళ్లపై అత్యాచారం.. ఎక్కడ?

ప్రజల్లో ఇంకా మూఢ నమ్మకాలు, జాతకాలు, బాబాలపై నమ్మకం ఏమాత్రం తగ్గట్లేదు. దొంగ బాబాల చేతిలో మోసపోయే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే వుంది. తాజాగా ఓ దొంగ బాబా తమ సమస్యలు చెప్పుకునేందు వచ్చిన మహిళపై అ

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:30 IST)
ప్రజల్లో ఇంకా మూఢ నమ్మకాలు, జాతకాలు, బాబాలపై నమ్మకం ఏమాత్రం తగ్గట్లేదు. దొంగ బాబాల చేతిలో మోసపోయే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే వుంది. తాజాగా ఓ దొంగ బాబా తమ సమస్యలు చెప్పుకునేందు వచ్చిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.


అక్కడితో ఆగకుండా.. ఆమె కుమార్తెపై కూడా లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగ బాబాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. దేశ రాజధానిలోని హజ్ ఖాన్ ఆశ్రమంలో ఉన్న స్వామిజీ ఆషు మహరాజ్‌పై ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2008 నుంచి 2013 వరకూ ఆషు మహరాజ్, ఆయన స్నేహితులు, కుమారుడు సమర్ ఖాన్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. నిందితులు తన మైనర్ కుమార్తెపై కూడా అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ఈ నెల 10న బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు ఆషు మహరాజ్‌తో పాటు ఆయన కుమారుడు సమర్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం