ఇంట్లో మందుకొట్టి గోలగోల... తొంగి చూడగానే యువతిని గట్టిగా వాటేసుకుని...

ఢిల్లీలో మరో యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. తాను నివశించే అపార్ట్‌మెంట్‌లోనే కొందరు మద్యంబాబులు ఓ యువతిపై సామూహిక అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్, మనేసర

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (16:45 IST)
ఢిల్లీలో మరో యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. తాను నివశించే అపార్ట్‌మెంట్‌లోనే కొందరు మద్యంబాబులు ఓ యువతిపై సామూహిక  అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్, మనేసర్ పారిశ్రామికవాడలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మనేసర్ పారిశ్రామికవాడకు చెందిన ఓ యువతి ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆమె రాత్రి 10 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చి మెట్ల మార్గం ద్వారా రెండో అంతస్తుకు వెళుతోంది. ఆ సమయంలో మొదటి అంతస్తులో కొందరు యువకులు మందు కొట్టి గొడవ చేస్తుండటాన్ని ఆమె గమనించారు. దీంతో వారిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. 
 
ఇందుకోసం ఆ గదిలో ఎవరు ఉన్నారో చూద్దామని నెమ్మదిగా తొంగిచూడగా, ఆమె చేతిలోని లంచ్‌బాక్స్ జారి కిందపడిపోయింది. ఈ శబ్దాన్ని విన్న గది లోపలి యువకులు, ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వారితో పెనుగులాడి, అరుస్తూ, తప్పించుకున్న యువతి, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తొలుత ఇద్దరిని అరెస్టు చేశారు. గదిలో ఇంకా చాలామంది ఉన్నారని, వారిని కూడా అరెస్ట్ చేయాలని అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన చేయడంతో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments