Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం : లేచిపోయేందుకు నిరాకరించిన వివాహిత గొంతుకోసిన ప్రియుడు....

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (14:57 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన ప్రేమకు నో చెప్పిందని ఓ శాడిస్టు ఓ వివాహిత గొంతుకోశాడు. ఆ తర్వాత తాను కూడా గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని దేవ్‌ లీ ప్రాంతానికి చెందిన పింకీ(24) అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన సన్నీ (26) అనే వివాహిత పరిచయమైంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. భర్తకు చేదోడువాదోడుగా ఉండేందుకు పింకీ బ్యూటీ పార్లర్‌లో పనికి వెళుతోంది. 
 
అయితే, గత ఫిబ్రవరి నెల 14వ తేదీన పింకీకి సన్నీ పరిచయమయ్యాడు. ఇదికాస్తా ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు ఢిల్లీ విధుల్లో షికార్లు చేయసాగారు. ఈ విషయం భర్తకు తెలిసి భార్యను మందలించడమేకాకుండా ఇంటిపట్టునే ఉండిపోవాలని ఆదేశించాడు. ఆ తర్వాత దేవ్ లీ ప్రాంతాన్ని వదిలేసి చిరాగ్ ఢిల్లీ ప్రాంతానికి మకాం మార్చాడు. 
 
అయితే పింకీని తనతో కలవకుండా చేయడంతో సన్నీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. దీంతో భర్త నుంచి వేరుపడాలని, ఇందుకోసం విడాకులు తీసుకోవాలని సన్నీ ఒత్తిడి చేశాడు. దీనికి పింకీ సమ్మతించలేదు. ఈ వివాహేతర సంబంధాన్ని ఇంతటితో ఆపేద్దామని చెప్పింది. పైగా, తన వెంటపడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. 
 
దీంతో పగ పెంచుకున్న సన్నీ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నేరుగా ఆమె ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఇద్దరం లేచిపోదాం రా.. అని బలవంతపెట్టాడు. ఇందుకు పింకీ ఒప్పుకోకపోవడంతో జేబులోని కత్తి తీసి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. 
 
అనంతరం పింకీ గొంతు కోసి తనూ గొంతు కోసుకున్నాడు. ఈ అరుపులు విన్న భవన యజమాని రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వీరిద్దరిని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పింకీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సన్నీ ఆరోగ్యం విషమంగా ఉందనీ, ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments