Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో భార్యతో ఏకాంతంగా ఉన్నాడనీ...

ఢిల్లీలో దారుణం జరిగింది. భార్యతో పడక గదిలో ఏకాంతంగా ఉండటాన్ని చూసిన అతను తన స్నేహితుడు చంపి ముక్కలుచేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఢిల్లీలో తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (09:41 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. భార్యతో పడక గదిలో ఏకాంతంగా ఉండటాన్ని చూసిన అతను తన స్నేహితుడు చంపి ముక్కలుచేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఢిల్లీలో తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఒడిషా రాష్ట్రంలోని టాటా నగర్‌కు చెందిన బాదల్ మండల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఢిల్లీలోని సైదులాజైబ్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈయనకు విపిన్ జోషి అనే స్నేహితుడు ఉన్నాడు. వీరిద్దరూ ఒకేచోట పని చేస్తున్నారు. దీంతో మండల్ ఇంటికి జోషి వస్తూపోయేవాడు. ఈ క్రమంలో మండల్ భార్యతో జోషికి వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
ఓ రోజు తన ఇంట్లోనే భార్యతో స్నేహితుడైన విపిన్ జోషి పడక గదిలో సన్నిహితంగా ఉండటం బాదల్ మండల్ కళ్ళారా చూశాడు. అంతే ఆవేశంతో రగిలిపోయిన బాదల్ ముందుగా భార్యా పిల్లలను స్వస్థలమైన టాటానగర్‌కు పంపించాడు. ఆపై స్నేహితుడైన విపిన్ జోషిని మందు పార్టీకి పిలిచిన బాదల్ మండల్ ఇంట్లోనే అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు. 
 
అనంతరం జోషి మృతదేహాన్ని ముక్కలుగా కోసం ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ప్రిజ్‌లో దాచిపెట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతలో జోషి హత్యానంతరం బాదల్ మండల్ అదృశ్యమయ్యాడు. 
 
బాదల్ మండల్ తన పేరును సింగ్రాగా మార్చుకొని రూర్కెలాలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడని తేలడంతో పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు బాదల్ తన నేరాన్ని అంగీకరించాడని డీసీపీ చిన్మయ్ బిశ్వాల్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments