Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై లైంగిక వేధింపులకు అడ్డాగా ఢిల్లీ.. చెత్త నగరం కూడా...

ఇటీవలికాలంలో మహిళలపై లైంగిక వేధింపులు విపరీతంగా జరుగుతున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో ఢిల్లీ ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నగరాల జాబితాలో ఢిల్లీ

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (07:55 IST)
ఇటీవలికాలంలో మహిళలపై లైంగిక వేధింపులు విపరీతంగా జరుగుతున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో ఢిల్లీ ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నగరాల జాబితాలో ఢిల్లీ ప్రపంచంలోనే మొదటివరుసలో ఉంది. ఇది మన వ్యవస్థ పనితీరుకు నిదర్శనంకాగా, ఢిల్లీ పాలకులకు సిగ్గుచేటు. 
 
మహిళల లైంగికవేధింపులపై లండన్‌కు చెందిన థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ సర్వేను చేపట్టింది. అరబ్ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన కైరో (ఈజిప్ట్) ప్రపంచంలోనే మహిళలకు రక్షణలేని అత్యంత చెత్త నగరంగా నిలిచింది. దాని తర్వాత పాకిస్థాన్‌లోని కరాచీ నగరం, కాంగో దేశంలోని కిన్షాసా సిటీ నిలిచాయి. ఈ వరుసలో వాటి తర్వాత స్థానాన్ని ఢిల్లీ, సావోపౌలో (బ్రెజిల్) సరిసమానంగా పంచుకున్నాయి. 
 
మహిళాసమస్యలకు సంబంధించిన 20 మంది నిపుణులు ఇచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఏడాది జూన్ నుంచి జూలై మధ్యకాలంలో 19 మహానగరాల్లో సర్వే నిర్వహించారు. ఢిల్లీలో మహిళలు నిత్యం లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, చిత్రహింసలు వంటి భయాలతో వణికిపోతుంటారని సర్వే పేర్కొన్నది. మహిళ భద్రత విషయంలోనే కాకుండా పలు అంశాల్లోనూ ఢిల్లీ చెత్త నగరంగానే నిలిచింది. 
 
మహిళలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా లండన్ ఎంపికైంది. మహిళల స్నేహపూర్వక నగరంగా లండన్‌ను సర్వే పేర్కొంది. భద్రతాపరంగా జపాన్ రాజధాని టోక్యో బెస్ట్ సిటీగా నిలిచింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ మూడోస్థానం సంపాదించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం