Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ కేసు దోషి ఇంటర్వ్యూను.. చెప్పే వరకు ప్రసారం చేయొద్దు!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (18:17 IST)
నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూకు సంబంధించిన వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు రంగంలోకి దిగింది. నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూను తాము ఆదేశించేంత వరకు ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ముఖేష్ ఇంటర్వ్యూపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంటరీ ప్రసారం నిలిపివేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
దీంతో, తాము చెప్పే వరకు ఏ మీడియా సంస్థ, పత్రికా ప్రచురించకూడదని ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి మరో ఆర్డర్ వచ్చే వరకు ఇదే వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్, బీబీసీ ఛానెల్‌తో కలిసి తీహార్ జైల్లో ముఖేష్‌ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments