Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వద్దన్నాడు.. శృంగారానికి నిరాకరించాడు.. కూరగాయలు కోసే కత్తితో వాటిని కోసేసింది...

ఢిల్లీలో ఓ అబల ఓ కామపిశాచికి తగిన శాస్తి చేసింది. నాలుగేళ్ల పాటు ప్రేమపేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి... ముద్దూముచ్చట తీర్చుకున్న యువకుడు తీరా పెళ్ళి మాటెత్తగానే వివాహం వద్దన్నాడు. దీంతో ఆగ్రహించిన

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (09:30 IST)
ఢిల్లీలో ఓ అబల ఓ కామపిశాచికి తగిన శాస్తి చేసింది. నాలుగేళ్ల పాటు ప్రేమపేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి... ముద్దూముచ్చట తీర్చుకున్న యువకుడు తీరా పెళ్ళి మాటెత్తగానే వివాహం వద్దన్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి... ఇంటికి పిలిచి శృంగారంలో పాల్గొనాలని అతడిని ఒత్తిడి చేసింది. అందుకు నిరాకరించడంతో కూరగాయలు కోసే కత్తితో జననాంగాలను కోసేసింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన మంగోల్‌పురిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారి రవి (35), నాలుగేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమించాడు. ముద్దూముచ్చట తీర్చుకున్నాడు. సినిమాలు, షికార్లంటూ ఢిల్లీ పార్కులు, వీధుల్లో తిరిగాడు. అయితే, బుధవారం ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడి వద్ద మాటల మధ్యలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. 
 
పెళ్లికి తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, తాను పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియురాలు రవిని బాత్‌రూములోకి తీసుకెళ్లి తనతో శృంగారం చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అందుకు అతడు నిరాకరించడంతో కూరగాయలు తరిమే కత్తితో జననాంగాలను కోసేసింది.
 
ఆ సమయంలో యువతి సోదరుడు, వదిన ఇంట్లోనే ఉన్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారు చూస్తూ ఉన్నారే తప్ప నిలువరించేందుకు ప్రయత్నించలేదని ఆరోపించాడు. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడిని జైపూర్‌లోని గోల్డెన్ ఆస్పత్రికి తరలించారు.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరారైన నిందితురాలితో సహా ఆమె కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments