లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు సిద్ధం.. కానీ : అరవింద్ కేజ్రీవాల్

ఠాగూర్
సోమవారం, 4 మార్చి 2024 (12:20 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హజరయ్యేందుకు సిద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే, ఈ నెల 12వ తేదీ తర్వాత తాను విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ మేరకు తాజా సమన్లకు ఆయన ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నట్టు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ కేసులో విచారణ నిమిత్తం మార్చి 4న రావాలని ఇటీవల కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసారీ గైర్హాజరైన సీఎం.. ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతానని అన్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
 
కాగా, ఢిల్లీ మద్యం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్‌ 2వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులు పంపిస్తున్నప్పటికీ హాజరు కావడం లేదు. సమన్లకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్దిరోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments