Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో ఓడిపోతే.. విద్యా బోధనకు వెళ్తా : కిరణ్ బేడీ

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (12:31 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తాను ఓడిపోతే.. విద్యా బోధనకు వెళ్లిపోతానని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతే ఏం చేస్తారని చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారని చెప్పారు.
 
ఇదే జరిగితే ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వర్శిటీలకు వెళ్లి బోధిస్తానని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, కేమ్ బ్రిడ్స్ యూనివర్శిటీల్లో ఇప్పటికే నాకు చాలా బోధన ఒప్పందాలున్నాయి. అవన్నీ ప్రస్తుతం ఆగిపోయాయి. బీజేపీ సభ్యురాలిగా ఉంటూనే వాటికి వెళతా. అంతేగాక నా నవ్ జ్యోతి, ఇండియా విజన్ ఫౌండేషన్ ట్రస్టుకు కూడా వెళతాను అని ఆమె వివరించారు.
 
కాగా, ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా అవినీతి ఉద్యమంలో తన స్నేహితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తనదైనశైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకుసాగిపోతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments