Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితంతు మహిళతో వివాహేతర సంబంధం.. చివరకు కుమారుడిని..?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (14:27 IST)
వితంతు మహిళతో, పెళ్లైన వ్యక్తి ఏర్పరుచుకున్న వివాహేతర సంబంధం ఓ 15 ఏళ్ల యువకుడిని బలితీసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నిహాల్ విహార్ ఏరియాలో నివసించే ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు. తన 15 ఏళ్ల కుమారుడితో కలిసి ఆవితంతు మహిళ జీవిస్తోంది. కొన్నాళ్ల క్రితం ప్రదీప్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
 
ఇక ప్రదీప్ సింగ్‌కు వివాహమై.. భార్యాపిల్లలున్నారు. కొన్నాళ్లకు ఈ విషయం ప్రదీప్ ఇంట్లో తెలిసింది. దీంతో అతని కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ప్రదీప్ కుటుంబ సభ్యులు వచ్చి ఆ మహిళను హెచ్చరించారు. ప్రదీప్‌తో అక్రమ సంబంధం వదులుకోవాలని చెప్పారు. కానీ ప్రదీప్ ఆమెను వదిలిపెట్టలేదు. తనతో సంబంధం కొనసాగించాలంటే భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ఆమహిళ ప్రదీప్‌ను కోరింది. అందుకు ప్రదీప్ అంగీకరించలేదు. దీంతో ఆ మహిళ ప్రదీప్‌ను దూరం పెట్టి మరో వ్యక్తికి దగ్గరైంది. మూడు నెలల క్రితం వారిద్దరూ వివాహాం చేసుకున్నారు.
 
ఇది సహించలేని ప్రదీప్ తన ప్రియురాలిపై పగ పెంచుకున్నాడు. ఆమెపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. తన సోదరుడు మరో ఇద్దరితో కలిసి ఆమె కుమారుడ్ని డిసెంబర్ 22న కిడ్పాప్ చేశాడు. కొడుకును విడుదల చేయాలంటే రూ. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన మాజీ ప్రియురాలికి ఫోన్ చేశాడు. వెంటనే ఆమె పోలీసులను సంప్రదించింది.
 
ఆమెకు వచ్చిన ఫోన్ కాల్ ఫరీదాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ప్రదీప్ సింగ్ ను పట్టుకోటానికి అక్కడకు బయలు దేరారు. ఫోన్ వచ్చిన ప్రదేశానికి వెళ్లి చూడగా మహిళ 15 ఏళ్ల కుమారుడు హత్యకు గురై కనిపించాడు. ప్రధాన నిందితుడు ప్రదీప్ సింగ్ మరో వ్యక్తి తప్పించుకు పారిపోగా, కిడ్నాప్, హత్యకు సహకరించిన ప్రదీప్ సోదరుడు కపిల్ సింగ్, అంకిత్ ప్రజాపతి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments