Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగుబోతు తండ్రికి తిక్క కుదిరింది.. అతడి కూతురు ఏం చేసిందంటే?

తాగుబోతు తండ్రి.. తాగొచ్చి.. వేధించాడు. ఇక చేసేది లేక కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తప్పతాగి ఇంటిక వచ్చి.. తల్లిని, చెల్లిని బూతులు తిడుతూ చావగ

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (10:26 IST)
తాగుబోతు తండ్రి.. తాగొచ్చి.. వేధించాడు. ఇక చేసేది లేక కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  తప్పతాగి ఇంటిక వచ్చి.. తల్లిని, చెల్లిని బూతులు తిడుతూ చావగొడుతున్నాడు.

ఈ వేధింపులు భరించలేని అతడి కూతురు తండ్రికి తిక్క కుదిరించాలనుకుంది. అంతే తప్ప తాగి వచ్చిన తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టింది. దాంతో తాగుబోతు తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 
 
ఈ కేసుపై కోర్టులో జరిగిన విచారణలో తాను తండ్రిపై కేసు పెట్టేందుకు గల కారణాలను అతడి కూతురు తెలిపింది. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తల్లిని, చెల్లిని తనను దుర్భషలాడుతూ శారీరకంగా హింసించేవాడని, లైంగిక ఫిర్యాదులు అంటే పోలీసులు తప్పకుండా స్పందిస్తారనే ఉద్దేశంతో తండ్రిపై కేసు నమోదు చేశానని చెప్పింది.
 
తండ్రి ఆగడాలతో ఇంట్లో తల్లి దుస్థితిని చూసి నిస్సహాయతకు గురైన బాలిక తన తండ్రికి బుద్ధిచెప్పాలనే ఉద్దేశంతో ధైర్యంగా ముందుకు వచ్చిన తీరును కోర్టు ప్రశంసించింది. అనంతరం బాలిక తండ్రిని రూ.25వేల పూచికత్తు మీద కోర్టు విడుదల చేస్తూ.. అతని ప్రవర్తన నడవడికపై ఏడాదిపాటు పరిశీలిస్తామని, ఒకవేళ మళ్లీ ప్రవర్తనలో తేడా వస్తే.. జైల్లో పెడతామని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం