Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో 15 మందిని తొక్కుకుంటూ వెళ్లిపోయిన కారు డ్రైవర్!!

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (13:23 IST)
ఢిల్లీలో ఓ దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ ఏకంగా 15 మందిని ఢీకొట్టి, వారిని తొక్కుకుంటూ కారును నడిపాడు. ఈఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఈస్ట్ ఢిల్లీలోని ఘాజీపూర్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మహిళను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన 22 యేళ్ల సీతాదేవిగా గుర్తించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్యాక్సీ డ్రైవర్ మయూర్ విహార్ ఫేజ్ 3కి వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. 
 
పీకల వరకు మద్యం సేవించిన ట్యాక్సీ డ్రైవర్ బుదవారం రాత్రి 9.30 గంటల సమయంలో రద్దీగా ఉన్న బుద్ధ్ బజార్ ప్రాంతంలోని జనాన్ని తొక్కించుకుంటూ పోయాడు. కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్ళడంతో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. కారును ధ్వంసం చేశారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించగా, స్థానికులు వారిని ఘెరావ్ చేశారు. అయితే, పోలీసులు లాఠీలకు పని చెప్పి వారిని చెదరగొట్టి, నిందితుడుని తమ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments