Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీమా సొమ్ముకు ఆశపడి, తననే హత్య చేయమని సుపారీ: పని పూర్తిచేసిన హంతకులు

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (08:12 IST)
తాను పడుతున్న ఆర్థిక కష్టాలు తన కుటుంబ సభ్యులు పడరాదని ఆ వ్యాపారి భావించాడు. పైగా, తాను చనిపోతే బీమా సొమ్ము వస్తుందని ఆశపడ్డాడు. ఆ డబ్బుతో తన కుటుంబం హాయిగా జీవిస్తుందని ఊహించుకున్నాడు. అంతే.. తనను హత్య చేయాల్సిందిగా కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చారు. వారు సుపారీ తీసుకున్న తమ విధిని తు.చ తప్పకుండా పాటించారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 
 
తాజాగా పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఢిల్లీకి చెందిన గౌరవ్ బన్సాల్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే, గత ఫిబ్రవరిలో రూ.6 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. ఆ సొమ్మును మానసిక ఒత్తిడిని అధికమించే చికిత్స కోసం వినియోగించాడు. 
 
అలాగే, క్రెడిట్ కార్డు మోసాల్లో రూ.3.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఓ దశలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాంతో తాను చనిపోతే వచ్చే బీమా డబ్బుతో కుటుంబం అయినా హాయిగా బతుకుతుందని భావించాడు.
 
తన మనసులో ఆలోచన రాగానే.. ఓ కిరాయి ముఠాకు చెందిన మైనర్ బాలుడిని సంప్రదించి, తన ప్లాన్ వివరించాడు. అంతేకాదు, తన ఫొటోను కూడా ఆ మైనర్‌కు పంపించాడు. ఫొటోలో ఉన్న వ్యక్తి ఫలానా ప్రదేశానికి వస్తాడని చెప్పి, అక్కడికి తానే వెళ్లాడు. 
 
ఆ కుర్రాడు మరో ముగ్గురి సాయంతో గౌరవ్ బన్సాల్‌ను చంపి చెట్టుకు వేలాడదీశాడు. అయితే, తన భర్త కనిపించడం లేదంటూ అతని భార్య షాను బన్సాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పని మీద బయటికెళ్లి తిరిగిరాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తమ విచారణలో భాగంగా గౌరవ్ ఫోన్ డేటాను పరిశీలించారు. ఇందులో ఓ మైనర్ కుర్రాడితో ఎక్కువ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో సొంత హత్యకు సుపారీ వ్యవహారం వెల్లడైంది. 
 
ఈ ఘటనలో మైనర్ బాలుడితో సహా మనోజ్ కుమార్ యాదవ్, సూరజ్, సుమిత్ కుమార్‌లను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆ వ్యాపారి దురాశ చివరకు బీమా సంగతి అటుంచితే తన ప్రాణాలను సైతం పోగొట్టుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments