Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీకి పిలిచి... బాలికకు మత్తుమందిచ్చి.. స్నేహితుల గ్యాంగ్‌రేప్

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. 13 యేళ్ళ బాలికపై కొంతమంది స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పుట్టిన రోజు పార్టీకంటూ పిలిచి.. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డా

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (11:46 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. 13 యేళ్ళ బాలికపై కొంతమంది స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పుట్టిన రోజు పార్టీకంటూ పిలిచి.. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పుట్టిన రోజు కోసం తన స్నేహితులను ఆహ్వానించాడు. వారిలో ఓ 13 యేళ్ల బాలిక కూడా ఉంది. ఈ పార్టీకి వచ్చిన ఆ యువతికి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. అది సేవించగానే ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. తర్వాత ఆమెను నిందితులు కలిసి అక్కడకు సమీపంలోని ఓ ఆస్పత్రి వద్ద వదిలేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
 
అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను చూసి ఆస్పత్రి వర్గాలకు చెప్పడంతో విషయం తెలిసింది. తర్వాత ఎలాగోలా ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ కూడా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్ల సాహిల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 376-డి (గ్యాంగ్ రేప్‌), పోస్కో చట్టాల కింద కేసులు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం