Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు : యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్‌లపై బహిష్కరణ వేటు!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (11:46 IST)
ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా చీపురు పార్టీలో తలెత్తిన విబేధాలపై పరిష్కరించే దిశగా ఇరు వర్గాలు భేటీ అయ్యాయి. కానీ, విభేదాలకు ఫుల్‌స్టాఫ్ పడేలా కనిపించడం లేదు. పైగా, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లను పార్టీ నుండి బహిష్కరించే యోచనలో ఉన్నారు. 
 
పార్టీ నుండి బహిష్కరించే కంటే ముందే.. రాజీనామా చేయాలని మరో సీనియర్ నేత అశుతోష్ యోగేంద్ర, భూషణ్‌లకు సలహా ఇచ్చారంటున్నారు. జాతీయ కార్యవర్గం నుండి రాజీనామా చేయాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ వర్గం తమను బలవంతం చేస్తోందని, తమ సూచనలు వేటినీ కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని యోగేంద్ర, భూషణ్‌లు గురువారం ఆరోపించారు.
 
శనివారం జాతీయ కార్యవర్గం భేటీ నిర్వహించనన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు. రాజీనామా చేయాలని లేదా జాతీయ కార్యవర్గం నుండి తొలగింపుకు సిద్ధం కావాలని రాజీ చర్చల్లో కేజ్రీవాల్ తఱఫున హాజరైన వారు తమను హెచ్చరించారని ఆరోపించారు. తామిద్దరం జాతీయ కార్యవర్గంలో ఉన్నంతకాలం కేజ్రీవాల్ జాతీయ కన్వీనర్‌గా కొనసాగేందుకు సుముఖంగా లేరని తమకు చెప్పారన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments