Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాన్ని విరిచి.. కొయ్యకు మూటగట్టి తరలించారు... ఒడిశాలో అమానవీయ ప్రవర్తన

సమాజంలో మానవీయ విలువలు నానాటికీ మృగ్యమైపోతున్నాయి. ఒడిషా రాష్ట్రంలో జరిగిన ఈ అమానవీయ సంఘటన ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భార్య మృతదేహాన్ని వాహనంలో ఇంటికి తీసుకుపోయేందుకు డబ్బుల్లేక 10 కిలోమీటర్లు మ

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (08:40 IST)
సమాజంలో మానవీయ విలువలు నానాటికీ మృగ్యమైపోతున్నాయి. ఒడిషా రాష్ట్రంలో జరిగిన ఈ అమానవీయ సంఘటన ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భార్య మృతదేహాన్ని వాహనంలో ఇంటికి తీసుకుపోయేందుకు డబ్బుల్లేక 10 కిలోమీటర్లు మోసుకుపోయిన భర్త ఉదంతం కళ్ళముందు కదులుతుండగానే... అదే ఒడిశాలో మరో అమానుష చర్య జరిగింది. రైలు ప్రమాదంలో చనిపోయిన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని విరిచి... వెదురు బొంగుకు మూటగట్టి ఇద్దరు వ్యక్తులతో తరలించిన ఘటన ఇపుడు కలకలం రేపుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తారామణి బారిక్ అనే 85 యేళ్ళ వితంతువును సోరో రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్‌రైలు ఢీకొట్టింది. ఆమె మరణించినట్టు సోరో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష కోసం బాలాసోర్‌లోని జిల్లా దవాఖానకు తరలించడానికి సహాయమందించాలని స్వీపర్‌ను రైల్వే పోలీసులు కోరారు. 
 
అయితే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న దవాఖానకు తరలించడంలో జీఆర్పీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత మృతదేహాన్ని తరలించేందుకు పూనుకొన్నారు. తీవ్రజాప్యం కావడంతో అప్పటికే శవం కొయ్యబారిపోయింది. దీంతో ఒక స్వీపర్ వృద్ధురాలి శవాన్ని కాళ్లను, నడుము ఎముకలను విరిచి ఓ గుడ్డలో మూటగట్టాడు. సోర్ రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్ వరకు ఓ వెదురు కట్టెకు తగిలించుకొని మోసుకెళ్లారు. 
 
రైల్వే సిబ్బంది తీరుతో మృతురాలి కుమారుడు రవీంద్ర నాయక్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన తన తల్లి శరీరంపై కనీసం సానుభూతి ప్రదర్శించకుండా ఆమానవీయంగా ప్రవర్తించారని అన్నారు. తన తల్లి శరీరాన్ని విరిచిన స్వీపర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ ప్రమోద్‌దాస్ మీడియాకు చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments