Webdunia - Bharat's app for daily news and videos

Install App

19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (12:25 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రేపు ఉద‌య‌దం 11 గంట‌ల‌కు పార్లమెంటు స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. సభ్యుల్లో అధిక శాతం మంది ఇప్ప‌టికే క‌రోనా టీకాలు తీసుకున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంటులో ప‌లు స‌మ‌స్య‌ల‌పై నిల‌దీసేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా, క‌రోనాతో పాటు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌లు, చైనాతో ప‌రిస్థితులు, దేశంలో నిరుద్యోగం, ఆర్థిక ప‌రిస్థితులు వంటి అంశాల‌పై కేంద్ర స‌ర్కారుని ప్ర‌శ్నించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకుంది.
 
సాగుచట్టాలపై రైతుల  ఉద్య‌మం, క‌రోనా ప‌రిస్థితులు, నిరుద్యోగం వంటి అంశాలు ఈ స‌మావేశాల్లో కీల‌కం కానున్నాయి. అలాగే, పెట్రో ఉత్పత్తుల ధరలపై ప్ర‌తిప‌క్షాలు గ‌ట్టిగా నిల‌దీసే అవ‌కాశం ఉంది.  
 
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం నేప‌థ్యంలో కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన‌ గెజిట్ నోటిఫికేష‌న్ అంశాన్ని లేవ‌నెత్తాల‌ని తెరాస నిర్ణ‌యించింది. అలాగే, విభ‌జన చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌ను ప్ర‌స్తావించాల‌ని వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది. 
 
పోల‌వ‌రం నిధులు, విశాఖ ఉక్కు అంశాల‌పై కూడా ప్ర‌శ్నించ‌నుంది. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి, రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల అంశాల‌ను లేవ‌నెత్తాల‌ని తెదేపా భావిస్తోంది. ఇదిలావుంటే, ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments