Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్ ఇబ్రహీం ఆస్తుల స్వాధీనం.. దౌత్య విజయమని కామెంట్ చేసిన బీజేపీ

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, అండర్‌ వరల్డ్‌ డాన్‌, ఉగ్రవాది దావూద్‌ ఇబ్రహీంకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సర్కారు షాకిచ్చింది. అతడి ఆస్తులని సీజ్ చేసింది. యూఏఈ సీజ్‌ చేసిన ఆస్తులు విలువ దాదాపు రూ.15వేల

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (11:07 IST)
మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, అండర్‌ వరల్డ్‌ డాన్‌, ఉగ్రవాది దావూద్‌ ఇబ్రహీంకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సర్కారు షాకిచ్చింది. అతడి ఆస్తులని సీజ్ చేసింది. యూఏఈ సీజ్‌ చేసిన ఆస్తులు విలువ దాదాపు రూ.15వేల కోట్లు ఉంటుందని అంచనా. 1993నాటి ముంబై పేలుళ్లకు ప్రధాన కారణం దావూద్‌ ఇబ్రహీం అని తెలిసిందే.

ఇంకా ఎన్నో నేరాలు అతడు చేశాడు. అతడి కోసం భారత్‌ ఎప్పటి నుంచో వెతుకుతోంది. పాక్‌లోనే అతడు తలదాచుకున్నాడని తెలుస్తోంది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యూఏఈ తాము నేరస్తులకు, ఉగ్రవాదులకు వ్యతిరేకం అని పరోక్షంగా చెప్పింది.
 
ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15,000కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన దౌత్య విజయమని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు బీజేపీ అధికారిక ట్వీట్టర్ పేజీలో ఈ వ్యాఖ్య పెడుతూ దానికి గ్రాఫిక్ చేసిన దావూద్ గురించిన సమాచారాన్ని ఉంచింది.

ప్రధాని మోడీ 2015 యూఏఈ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశ సర్కారుకు దావూద్ ఆస్తుల జాబితాను అందించారని బీజేపీ ఆ ట్వీట్‌లో పేర్కొంది. యూఏఈ ప్రభుత్వం దర్యాప్తు చేసి దావూద్ ఆస్తులను సీజ్ చేసిందని బీజేపీ వివరించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments