Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా తండ్రి మృతి.. మనస్తాపంతో తండ్రి చితిలో దూకిన కుమార్తె... ఎక్కడ?

Webdunia
బుధవారం, 5 మే 2021 (11:12 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంటుంది. ఒక కుటుంబంలో కరోనా వైరస్ సోకితే... ఆ కుటుంబ సభ్యులందరికి ఈ వైరస్ సోకుతుంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి కారణంగా కన్న తండ్రి మరణించాడన్న మనస్తాపంతో ఆయన చితిలోనే దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతి, ఇప్పుడు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 
 
ఈ విషాదకర ఘటన ఇండో పాక్ సరిహద్దుల్లో ఉన్న బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడ నివాసం ఉంటున్న దామోదర్ దాస్ కరోనా సోకి మరణించాడు.
 
అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన స్థానిక పంచాయతీ సిబ్బంది, కుమార్తెలు, ఇతర బంధువుల సమక్షంలో చితికి నిప్పంటించారు. ఆ వెంటనే, దామోదర్ దాస్ కుమార్తె శారద చితిపైకి ఉరికింది.
 
 దీంతో దిగ్భ్రాంతి చెందిన బంధుమిత్రులు, ఆమెను బయటకు తీసేలోగానే 70 శాతం కాలిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, వివరాలు సేకరించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువతి, ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేదని, అందువల్ల ఇంకా స్టేట్మెంట్‌ను నమోదు చేయలేదని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ వెల్లడించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments