Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ దాచిపెట్టాడనీ... కన్న తండ్రిని కొట్టి చంపిన కుమార్తె... ఎక్కడ?

ఫోన్ దాచిపెట్టాడనీ... కన్న తండ్రిని కొట్టి చంపిన కుమార్తె... ఎక్కడ?
Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (07:57 IST)
మొబైల్ ఫోన్‌కే అంకితమైన కుమార్తెను తిరిగి దారికి తెచ్చే క్రమంలో కుమార్తె చేతిలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. మొబైల్ ఫోన్ దాచిపెట్టాడన్న కోపంతో కన్నతండ్రిని కుమార్తె కొట్టి చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌ జిల్లాలో జరిగింది.
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిలాస్‌పూర్ జిల్లాలోని కాంచన్​పూర్​ గ్రామానికి చెందిన మాంగ్లు రామ్​ధనుకర్​ (58) అనే వ్యక్తికి దివ్య సరస్వతి అనే కుమార్తె ఉంది. ఈమెకు వివాహమైంది. ఇటీవలే ఆమె భర్త తల్లిదండ్రుల దగ్గరకి పంపించాడు. 
 
పుట్టింటికి వచ్చిన సరస్వతి... తన సెల్​ఫోన్​ కనిపించడం లేదని తండ్రి మాంగ్లును అడిగింది. తనేమన్న తీస్తే ఇవ్వమంది. తను సెల్​ఫోన్​ తీయలేదని మాంగ్లు సమాధానమిచ్చాడు.
 
అనుమానమొచ్చి కాస్త గట్టిగా అడిగింది సరస్వతి. దాంతో అతను నిజం చెప్పాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకున్నందుకే ఫోన్​ దాచినట్లు తెలిపాడు. 
 
ఎంతకీ ఫోన్ ఇవ్వకపోవడం వల్ల కర్రతో కొట్టి, రాయితో బాది తండ్రిని హతమార్చిందని పోలీసులు తెలిపారు. శవాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిందని, అందుకు ఆమె తల్లి సహకరించిందని పేర్కొన్నారు.
 
పక్కింటివారు ఈ ఘటనను చూసి తమకు సమాచరమిచ్చారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments