Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం.. అంతే ఆత్మరక్షణ కోసం చంపేసింది..

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (13:16 IST)
కామాంధులు వావివరుసలు మరిచిపోతున్నారు. కన్నకూతురిపై కన్నతండ్రే కామవాంఛ తీర్చాలని విచక్షణ కోల్పోయి అకృత్యానికి ఒడిగట్టాడు. చివరకు కుమార్తే అతడిని హతమార్చింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ దివ్యాంగుడు. కొన్ని రోజుల క్రితం తన భార్య చనిపోయింది. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు. వెంకటేశ్‌ పెద్ద కుమార్తె చెన్నైలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా చిన్న కుమార్తె ఇంటి వద్దే ఉంటూ పదకొండో తరగతి చదువుతోంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది.
 
దానికి సంబంధించి వెంకటేష్ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లి వచ్చాడు. వెంకటేష్ ఇంటికి తన బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో సీన్ చూసి షాక్ అయ్యారు. అక్కడ వెంకటేష్ విగత జీవిగా పడి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతదేహంపై కత్తి పోట్లను బట్టి.. తొలుత రాజకీయ హత్యగా భావించారు.
 
వెంకటేశ్‌ రెండో కుమార్తె తండ్రిని హత్య చేసిందని అనంతరం దర్యాప్తులో గుర్తించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి తనపై అత్యాచారం చేయబోయాడని, తన ఆత్మరక్షణ కోసమే అతడిని చంపేశానంటూ ఆమె చెప్పింది. 
 
ఈ వివరాలను డీఎస్పీ ఇళంగోవన్‌ వెల్లడించారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆత్మరక్షణ కోసమే ఆమె హత్య చేసిందని, తక్షణమే విడుదల చేయాలని విల్లుపురం జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments