నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క పునాది కనెక్టివిటీ మరియు డేటాయేనని, భౌతిక, డిజిటల్, జీవపరమైన అన్ని శాస్త్రాల సమ్మేళనం ఫలితంగానే కనెక్టివిటీ, డేటా సమాజం అందుబాటులోకి వచ్చాయని అంబానీ వివరించారు.
ఆధునిక యుగానికి కొత్త సహజ వనరు డేటాయే అని రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఈ యుగంలో డేటాను రూపొందించాలంటే అనేకమది ప్రజలు మీ వద్ద ఉండాలని, ఆ రకంగా చూస్తే 120 కోట్లమంది ప్రజలు భారత్‌కు వరంలాంటి వారని ముఖేష్ ప్రశంసించారు.
ఒక కొత్త యుగం ఆరంభంలో మనం ఉంటున్నాం. ఈ యుగంలో కొత్త ఇంధనం డేటాయే. భారత్ దేశంలోని యువజనాభా తన నైపుణ్యంతో ప్రపంచం మొత్తం మీద పోటీలో ముందు ఉంటుందని ముఖేష్ తెలిపారు. టెక్నాలజీ పలు వాణిజ్య కలాపాలపై ఎలాంటి ప్రభావం వేస్తుందో చెప్పడానికి ఆధార్ ఒక పెద్ద ఉదాహరణ అని ముఖేష్ తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క పునాది కనెక్టివిటీ మరియు డేటాయేనని, భౌతిక, డిజిటల్, జీవపరమైన అన్ని శాస్త్రాల సమ్మేళనం ఫలితంగానే కనెక్టివిటీ, డేటా సమాజం అందుబాటులోకి వచ్చాయని అంబానీ వివరించారు.
భారతీయ వాణిజ్య నైపుణ్యాలపై తనకు అపార విశ్వాసం ఉందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. యువ భారతీయలు ఒక్కటైన ప్రతి సందర్భంలోనూ మనకు నూతన అవకాశాలు బహుమతిగా వస్తున్నాయని, మన యువత అద్భుత కృషి చేస్తూ అధిక ఫలితాలను సాధిస్తున్నారని ముఖేష్ కొనియాడారు.