Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా చికెన్ ఇవ్వలేదని దళితుడిని చెప్పులతో చావగొట్టారు...

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2023 (11:00 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చెందిన ప్రజలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రకాలైన దాడి ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఓ దళితుడిపై చెప్పులతో చావబాదారు. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటంటే.. ఉచితంగా చికెన్ ఇవ్వకపోవడమే. దీంతో అతనిపై చెప్పులతో చావగొట్టారు. ఈ ఘటన లలిత్ పూర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లలిత్‌పూర్ జిల్లాలో ఓ దళిత వ్యక్తి ఊరారా తిరుగుతూ చికెన్ అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు ఉచితంగా చికెన్ ఇవ్వాలని అడిగ్గా, అందుకు నిరాకరించాడు. దీంతో అతనిపై రోడ్డుపైనే చెప్పులతో చావబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితుడు సుజన్ అహిర్వాన్‌ను నడిరోడ్డుపై చెప్పులతో కొడుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 
 
బైకుపై తిరుగుతూ గ్రామాల్లో చికెన్‌ విక్రయించే అహిర్వార్ వద్ద నిందితులు చికెన్ తీసుకున్నారు. డబ్బులు అడగడంతో ఆగ్రహించిన నిందితులు... అతడిని పట్టుకుని ఈడ్చుకుంటూ చెప్పులతో దాడి చేశారు. తనను వదిలేయాలని ఎంతగానో ప్రాధేయపడినా కనికరం చూపలేదు కదా మరింతగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు... నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments