Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం భార్యకే టోకరా.. రూ.23 లక్షలు స్వాహా చేసిన కేటుగాడు

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (13:01 IST)
దేశంలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ టార్గెట్ చేస్తూ... లక్షల కొద్దీ సొమ్మును కాజేస్తున్నవారు ఉన్నారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య, ఎంపీ ప్రణీత్ కౌర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో పడ్డారు. 
 
బ్యాంకు మేనేజర్‌ పేరిట వచ్చిన కాల్‌ కారణంగా 23 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే పార్లమెంటు సమావేశాలకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రణీత్‌ కౌర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను బ్యాంకు మేనేజర్‌ను అని, ఎంపీ జీతం డిపాజిట్‌ చేసే అకౌంట్‌ అప్‌డేట్‌ కోసమే కాల్‌ చేసినట్లు చెప్పాడు. 
 
ఈ మేరకు అకౌంట్‌ నంబరు, ఏటీఎం పిన్‌ నంబరు, సీవీసీ నంబరు తదితర వివరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడి మాటలు నమ్మిన ప్రణీత్‌ కౌర్‌ వివరాలతో సహా ఓటీపీ కూడా చెప్పారు. ఈ క్రమంలో కొన్ని నిమిషాల తర్వాత ఆమె అకౌంట్‌ నుంచి 23 లక్షల రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. 
 
తాను మోసపోయినట్లుగా గుర్తించిన ప్రణీత్‌ కౌర్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అక్కడే అతడిని అరెస్టు చేసి పంజాబ్‌ తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments