Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీలతో నిండిపోతున్న 'సీవిజిల్' యాప్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (10:41 IST)
భారతదేశంలో ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏవైనా అక్రమాలకు పాల్పడితే లేదా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిని పట్టించేందుకు ఎన్నికల సంఘం ఓటరుకు ఇచ్చిన వజ్రాయుధం "సీవిజిల్" యాప్. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిటిజన్స్ (పౌరులు), జాగృతి (విజిల్) అనే ఆంగ్ల పదాల కలయికతో ఈ యాప్‌కు "సీవిజిల్" అని పేరు పెట్టారు. 
 
ఎన్నికల్లో డబ్బు, మద్యం, చీరలు, బహుమతులు పంచడం వంటి వాటిని ఫోటో లేదా వీడియో తీసి ఈ యాప్ ద్వారా పంపితే 15 నిమిషాల్లో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతారు.
 
అయితే ఇంతటి గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన యాప్‌ను కొందరు అవగాహనా లోపంతో దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల నియమావళి అతిక్రమణకు సంబంధంలేని సెల్ఫీలు, కంప్యూటర్ స్క్రీన్‌లు, చెట్లు చేమలు, కొండలు, ప్రకృతి ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. 
 
పంజాబ్ రాష్ట్రంలో అయితే ఈ యాప్ ద్వారా అప్‌లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలలో దాదాపు 60 శాతం అటువంటివే ఉన్నాయని ఎన్నికల సంఘం తెలియజేసింది. ప్రజలకు ఈ యాప్‌ను సదుద్దేశంతో అందించామని కాబట్టి ఈ యాప్‌ను దుర్వినియోగం చేయకుండా అవగాహనతో ఉపయోగించాలని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments