Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500,1000 నోట్ల రద్దు.. రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ: జైట్లీ

రూ.500,1000 నోట్ల రద్దుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. నిజాయితీగా సంపాదించిన వారు ఎం

Webdunia
బుధవారం, 9 నవంబరు 2016 (12:39 IST)
రూ.500,1000 నోట్ల రద్దుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. నిజాయితీగా సంపాదించిన వారు ఎంత డబ్బు అయినా బ్యాంకుల్లో మార్చుకోవచ్చునని తెలిపారు. రూ.500, రూ. 1000 రూపాయలను రద్దు చేయడంతో నిజాయితీపరులకు ఎలాంటి సమస్య లేదన్నారు. నగదు లావాదేవీలు లేని సమాజం రావాలని అరుణ్‌జైట్లీ ఆకాంక్షించారు. ఇంకా పెద్ద నోట్ల రద్దు దీర్ఘకాలంలో మంచి ఫలితాలిస్తుందని జైట్లీ వ్యాఖ్యానించారు. రూ.500,1000 నోట్ల రద్దు నేపథ్యంలో.. రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ వెళ్లిందని తెలిపారు. 
 
కాగా.. దేశంలో అవినీతిని రూపుమాపే క్రమంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతం మనుగడలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లు చెల్లవని, ఎవరిదగ్గరైనా రూ.500, రూ.1000 నోట్లు ఉంటే వారు డిసెంబర్ 31 లోగా ఆయా నగదును బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్ చేయాలని ప్రధాని సూచించారు. ఈ ప్రక్రియ అమలులో భాగంగా బుధ, గురువారాల్లో ఏటీఎం సెంటర్లు పనిచేయవని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments