Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం.. శశికళకు పార్టీ పగ్గాలు.. మరి అజిత్ సంగతేంటి? భేటీ ఎందుకు?

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తొలిసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరుగనుంది. గురువారం (డిసెంబర్ 29) జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుందని

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (14:02 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తొలిసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరుగనుంది. గురువారం (డిసెంబర్ 29) జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆ పదవిని శశికళ అధిష్టించే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి. శశికళ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని, దాంతో పాటు ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టాలని అన్నాడీఎంకేలోని ఒక వర్గం గట్టిగా వాదిస్తోంది. ఈ వర్గంలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటంతో వీరి వాదన చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 
 
కానీ శశికళ మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే హీరో అజిత్‌తో భేటీ అయ్యారు. కేవలం అనుకూల వర్గానికి మాత్రమే ఆహ్వానాలు పంపి వారి ఆధ్వర్యంలో ఎన్నిక జరిగేలా చూసుకుని.. పార్టీ పగ్గాలను తను అందుకునే దిశగా శశికళ ప్రయత్నాలు చేస్తున్నట్లు సన్నిహితుల సమాచారం. మరోవైపు జయలలిత అన్న కుమార్తె దీప జయకుమార్ నరేంద్ర మోడీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఆమెకు మోడీ అపాయింట్‌మెంట్ లభిస్తుందో లేదో అనేది ప్రశ్నార్థకం. అలాగే అన్నాడీఎంకే అధ్యక్ష పదవి ఎన్నికల వ్యవహారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పరిశీలిస్తోంది. మరి గురువారం జరుగనున్న కీలక అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం శశికళకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెడుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments