Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రైమ్ సిరీస్ చూసి భర్తను... ప్రేమికుడితో కలిసి చంపేసింది..

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (10:22 IST)
క్రైమ్ సిరీస్ చూసి భర్తను ఓ భార్య ప్రేమికుడితో కలిసి హత్య చేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌కు చెందిన కళ్యాణ్‌పూర్‌లోని శివలీ రోడ్డులో రిషబ్ తివారీ (29) తన భార్య సప్నాతో కలిసి నివసించాడు.
 
నవంబర్ 27న తన స్నేహితుడు మనీష్‌తో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు చకర్‌పూర్ గ్రామానికి స్కూటీపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా చకర్పూర్ గ్రామ సమీపంలో అకస్మాత్తుగా దాడి జరిగింది. ఈ ఘటనతో గాయాలపాలైన అతడు స్వరూపనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
రిషబ్ పరిస్థితి మెరుగుపడటంతో డిసెంబర్ 1న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే డిసెంబర్ 3న రిషబ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆపై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
కృష్ణానగర్ వాసి రాజు గుప్తాతో సప్నా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలిసింది. రిషభ్ పేరు మీద చాలా పెద్ద ఆస్తులున్నాయి. దోచుకోవడానికి ఈ ఇద్దరు కుట్ర పన్నారు. కుట్రలో భాగంగా రాజు తన సహచరుడు సితుతో కలిసి నవంబర్ 27న రిషబ్‌పై దాడి చేశాడు.
 
ఈ దాడిలో అతను గాయపడ్డాడు, కానీ అతని ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పుడు, అతని భార్య సప్నా అతనికి ఓవర్ డోస్ మందులు ఇస్తూనే ఉంది. దీంతో రిషబ్ ఆరోగ్యం క్షీణించి మరణించాడు. ఈ కేసులో నిందితులు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ చాట్ హంతకులను బట్టబయలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments