Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో కొవిడ్‌ వైరస్ కల్లోలం - మళ్లీ వైరస్​ విజృంభణ

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (14:23 IST)
కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు రెండు వారాలుగా ఉద్ధృతమయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేరళ సరిహద్దుల్లో కర్ణాటక ఆంక్షలు విధించింది. 
 
తమిళనాడు సైతం కేరళ నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష, కొవిడ్‌ టీకా ధ్రువపత్రాలను తప్పనిసరి చేసింది. గడచిన నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు 80 శాతం మేర పెరిగాయి. భారత్‌లో 46జిల్లాల్లో పది శాతానికి పైగా, 53జిల్లాల్లో అయిదు నుంచి పది శాతం వరకు పాజిటివిటీ రేటుతో కేసులు నమోదవుతున్నాయి. ఆయా జిల్లాల్లో కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. 
 
మరోవైపు టీకాల కొరతతో వాటి పంపిణీ మందకొడిగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే- కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు రెండు వారాలుగా ఉద్ధృతమయ్యాయి. 
 
రోజువారీ కేసుల సంఖ్య 22 వేలు దాటింది. పాజిటివిటీ రేటు 11 నుంచి 14.5శాతం వరకు ఉంటోంది. ఈ పరిస్థితుల్లో కేరళ సరిహద్దుల్లో కర్ణాటక ఆంక్షలు విధించింది. తమిళనాడు సైతం కేరళ నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష, కొవిడ్‌ టీకా ధ్రువపత్రాలను తప్పనిసరి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments