Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్:కేంద్రం

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:11 IST)
క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు. రాజ్యసభలో ఆదివారం సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ కోసం దేశంలో ఆరు సంస్థలకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఐ) అనుమతించినట్లు మంత్రి చెప్పారు.

అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్‌, అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా హెల్త్‌కేర్‌, హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ, అరబిందో ఫార్మా, ముంబైకి చెందిన రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉన్నట్లు తెలిపారు.

ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరో 30 వరకు వ్యాక్సిన్‌ పరిశోధనలకు సాయపడుతున్నట్లు చెప్పారు.

కోవిడ్‌ 19 టెస్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్‌ 18 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 10 లక్షల జనాభాకు 85,499 మందికి కోవిడ్‌ -19 టెస్ట్‌లు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.

అలాగే కోవిడ్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌, హెల్త్‌ సిస్టమ్‌ ప్యాకేజి కింద రెండు దశలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 200 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments