Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలవరపెడుతున్న కొత్త కరోనా స్ట్రైన్ : మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (09:54 IST)
బ్రిటన్‌లో పురుడుపోసుకున్న కొత్త రకం కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ కరోనా స్ట్రైన్ దెబ్బకు బ్రిటన్ అల్లాడిపోతోంది. దీంతో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలను అనేక దేశాలు నిషేధించాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో డిసెంబర్-22 నుంచి జనవరి-5 వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రకటించింది. 15 రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని అధికారులు తెలిపారు.
 
అంతేకాకుండా, బ్రిటన్‌లో పుట్టిన కరోనా 'న్యూ వెర్షన్' విజృంభణ నేపథ్యంలోనే ముందుజాగ్రత్తగా మహా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై భారత్ తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెల్సిందే. డిసెంబర్‌ 31 వరకు అన్ని విమాన సర్వీసులపై నిషేధం విధించింది. రేపు అర్థరాత్రి నుంచి నిషేధం అమలులోకి రానుంది. 
 
ప్ర‌స్తుతం యూకే నుంచి వ‌స్తున్న విమానాల్లో ఉన్న ప్ర‌యాణికుల‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు కేంద్ర విమాన‌యాన శాఖ తెలిపింది. ఇప్ప‌టికే యూకే నుంచి బ‌య‌లుదేరిన విమానాలు లేదా డిసెంబ‌ర్ 22, 2020 రాత్రి 11.59 గంట‌ల‌లోపు వ‌చ్చే విమానాల్లో ప్ర‌యాణికుల‌కు ఈ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. 
 
అలాగే, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిచేసింది. కాగా, డిసెంబరు 22వ తేదీలోపు సుమారు వెయ్యి మంది ప్రయాణికులు ఆయా దేశాల నుంచి ముంబైకు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వీరందరికీ ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌ను తప్పనిసరిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments