Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కోరోనిల్' పేరుతో కరోనాకు పతంజలి మందు.. 5 నుంచి 14 రోజుల్లో...?

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (13:00 IST)
corona medicine
'కోరోనిల్' పేరుతో కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు దేశీయ కంపెనీ పతంజలి తెలిపింది. ఈ మందును మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు బాబా రాందేవ్‌ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. 
 
'కరోనిల్' మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. కరోనా వైరస్‌కు మందును తీసుకువస్తున్నామని గతంలోనే పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కోవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా రాందేవ్‌ మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అన్నారు. 
 
ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చునని చెప్పుకొచ్చారు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకమన్నారు. మందును తీసుకురావడంలో తమ శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయమని రాందేవ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments