Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నెలరోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (09:21 IST)
మనస్పర్థల కారణంగా విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలిపేందుకు గ్వాలియర్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. భర్త నుంచి వేరుగా ఉంటున్న భార్య పిటిషన్‌పై విచారణ చేపట్టి సంచలన తీర్పు ఇచ్చింది. 
 
భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు భర్త నెలరోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలని ఆదేశించింది. అయినప్పటికీ తీరు మారకపోతే తర్వాత ఆలోచిస్తామని వెల్లడించింది. ఈ తీర్పు ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని సేవానగర్‌కు చెందిన గీతా రజక్, మొరాదా కు చెందిన గణేశ్‌కు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు సంతానం. కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి దాంపత్యంలో ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వీరిద్దరి ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. 
 
ఈ క్రమంలో గీత తన భర్తను వదిలి వెళ్లిపోయింది. అయితే తమ బిడ్డను ఇచ్చేందుకు గణేశ్ నిరాకరించాడు. కుమారుడు తన వద్దే పెరుగుతాడని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గీత గ్వాలియర్ హైకోర్టును ఆశ్రయించింది. తన బిడ్డను తన దగ్గరకు చేర్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
 
ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ఒక విచిత్రమైన తీర్పు వెల్లడించింది. గణేశ్ ఒక నెల రోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలని తీర్పునిచ్చింది. అదే విధంగా అల్లుడిని బాగా చూసుకోవాలని గీతా కుటుంబసభ్యులకు సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments