Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్ ఐరన్ లేడీ షర్మిలని విడుదల చేయండి: సెషన్స్ కోర్టు

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (12:31 IST)
ఆత్మహత్యాయత్నం నేరం కింద అరెస్టు చేసిన మణిపూర్ పౌర హక్కుల మహిళా నేత ఇరోమ్ షర్మిల చానును తక్షణం విడుదల చేయాలని స్థానిక సెషన్స్‌ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ రాష్ట్రంలో అమలులో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలంటూ మణిపూర్ ఐరన్ లేడీగా ఇరోమ్ గత 14 ఏళ్లగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. 
 
అయితే, దీక్ష విరమింపజేసేందుకు ఆమెపై మణిపూర్ పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసును బనాయించి జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. అప్పట్నుంచి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ముక్కు ద్వారా ద్రవ ఆహారాన్ని అందజేస్తున్నారు. అయితే సెక్షన్ 309 కింద ఆమెపై మోపిన ఆత్మహత్యాయత్నం ఆరోపణలు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. జుడీషియల్ కస్టడీలో ఉన్న షర్మిలను తక్షణం విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇరోమ్ షర్మిల విషయంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును కోర్టు తప్పుపట్టింది. 

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

నార్నే నితిన్ చిత్రం ‘ఆయ్’ నుంచి రంగనాయకి సాంగ్ విడుదల

డీజే కావాలనుకునే అజయ్ ఘోష్ చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

Show comments