Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి గంగేశానంద కేసు... సీన్లోకి యువతి బాయ్‌ఫ్రెండ్.. నిర్భంధించారని హైకోర్టులో పిటిషన్

కేరళలో స్వామి గంగేశానంద అనే దొంగబాబా మర్మాంగాన్ని ఓ యువతి కత్తిరించి పారేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. దొంగ బాబా పేరిట లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలని మర్మాంగాన్ని కత

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (17:13 IST)
కేరళలో స్వామి గంగేశానంద అనే దొంగబాబా మర్మాంగాన్ని ఓ యువతి కత్తిరించి పారేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. దొంగ బాబా పేరిట లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలని మర్మాంగాన్ని కత్తిరించేసిన విద్యార్థిని ప్రస్తుతం అదృశ్యమైంది. ఈ మేరకు దొంగబాబా మర్మాంగాన్ని కోసేసిన విద్యార్థిని కనిపించట్లేదని ఆమె బాయ్‌ఫ్రెండ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన గంగేశానంద స్వామి అదే ప్రాంతానికి చెందిన ఓ లా విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడగా, ఆ యువతి దొంగబాబా మర్మాంగాన్ని కోసిపారేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాత ఆ బాబా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ.. ఉపయోగం లేని తన మర్మాంగాన్ని తానే కోసేసుకున్నట్టు ప్రకటించాడు. ఈ కేసుపై కేరళ ప్రత్యేక విభాగం పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆ యువతి బాయ్ ఫ్రెండ్ సీన్లోకి వచ్చారు. బాబాపై దాడికి పాల్పడిన యువతిని గృహనిర్భంధంలో ఉంచారని, కిడ్నాప్ చేశారని.. ఆమె అదృశ్యమైందని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి సమాధానం ఇవ్వాలని కోరుతూ పోలీసులను కోర్టు ఆదేశించింది. 
 
కాగా, ఇప్పటికే స్వామి గంగేశానంద మర్మాంగాన్ని కోసేసిన కేసులో బాధితురాలే మాట మార్చింది. ఆయన తనకు తండ్రిలాంటివాడనీ, తనపై అత్యాచారం చేయలేదని, కేవలం దగ్గరకు తీసుకున్నారంతేనంటూ చెప్పింది. దీంతో ఆమెను పాలీగ్రాఫ్ పరీక్షకు పంపించాలని త్రివేండ్రం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kesari2 : అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం