Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో లాక్‌డౌన్ సడలింపులు ఉండవ్ : సీఎం అరవింద్ కేజ్రీవాల్

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (15:31 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది మే నెల 3వ తేదీ వరకు అమల్లోవుండనుంది. అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత ఆంక్షలు సడలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం స్పందిస్తూ, కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి మినహాయింపులు లేకుండానే లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించింది. 
 
కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే లాక్‌డౌన్‌ సడలిపులపై సీఎం కేజ్రీవాల్‌ ఆదివారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 
 
ఈ క్రమంలో ఢిల్లీలో కరోనా తీవ్రంగా ఉండటంతో సడలింపు ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఎలాంటి మినహాయింపులు లేవని కేజ్రీవాల్‌ అధికారికంగా ప్రకటించారు. కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ సడలింపుపై ఏప్రిల్‌ 27న మరోసారి సమీక్ష నిర్వహించి అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. 
 
క‌రోనా వైరస్ ప్రభావం ఢిల్లీలో అధికంగానే ఉంది. పాజిటివ్‌ కేసుల్లో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. దేశ రాజధానిలో 71 కంటైన్మెంట్ జోన్ల‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 1,893 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 42 మంది మరణించారు. 
 
ఈ క్రమంలో లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇస్తే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేజ్రీవాల్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో బయటకు రావద్దని సీఎం కేజ్రీవాల్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments